web analytics

Home

ఇండియన్ పెంతెకోస్తు చర్చి, విశాఖ సంఘ 50సం||ల సుధీర్గ సంక్షిప్త చరిత్ర

నాంది:కేరళ వాస్తవ్యులు ఆపో.పి.ఎమ్.సామ్యూల్ గారు ఆంధ్ర ప్రాంతంలో విజయవాడను కేంద్రముగా చేసుకోని ఐ.పి.సి. సంస్థను స్థాపించిరి.వీరికి దైవదర్శనమందు సముద్ర తీరమున సేవ ప్రారంభించుచున్నట్లుకనబడెను. ఆ సమయములందే పశ్చిమ గొదావరిలో మసకపల్లిలో సేవచేయుచున్న ఐజక్ నాతన్ గారికి కూడా దర్శనమందు సముద్ర తీరమున ఆయన సేవచేయుచున్నట్లుకనబడెను. మరియు స్పష్టమైన పిలుపుకూడ వినిరి. ఆ విధముగా 1958 లొకట్టుబట్టలతో సముద్రతీరమునకు వచీ ప్రార్దీంచు చుంఢఃగా బ్రదర్ ఆత్రేయరావు గారి పరిచయముతొ పెంటవీదిలో జరుగుచున్న కూటమునకు తీసుకొనిరాబడిరి. తనకు ఇవ్వబడిన కొంచెము సమయములొనే వాక్యపరిచర్యద్వారా అక్కడి వారు కన్నీరు కార్చి, పశ్ఛాతాపం పొంది, మారుమనస్సు పొందీరి.వారిలొ గురుమూర్తి గారు, మార్టిన్ గారు, చిన్నజనకమ్మగారు, మొదలగువారు కలరు.

ప్రారంభ దినాలు:Seven బ్రదర్స్ ద్వారా కొంఢమీద జరుగుచున్న సహవాసమునకు పరిచయుస్తులై వీరి సేవ వాడవాడల విస్తరించుండెను. పరిశుద్ధాత్మ అగ్నివలేవచ్చుటయును, అద్బుతములు మరియు సూచక క్రియలును జరుగుచుండెను. వ్యతిరేక వర్గాలవలన ఇబ్బందులు కల్గుచుండెడివి. లైట్లు, డ్రమ్ములు పగలగొట్టుట, రాళ్లతో కొట్టుట చివరకు పోలీసు స్టేషనుకు వెళ్లుట జరుగుచుండెను.అట్టి పరిష్థితిలొ జంగాలయ్యగారు, సింహాద్రిగారు, పెంటయ్యగారు, గవరయ్యగారు, M.S పాల్ గారు, పెద్ధ జానకమ్మగారు, జొషఫ్ గారు, మార్కుగారు రక్షింపబడిన వరిలో ముఖ్యులు.
సంఘ భవనము: తాత్కాలికంగా ఆరాదన పశువుల ఆసుపత్రి స్ఠలములలో జరుగు చుండెను. సంఘ విస్తరణ బట్టి అపో. పి ఎమ్. సామ్యూల్ గారి ఆర్దిక సహాయంతో సంఘమునకు ఒక స్థలము కొనబడెను. మరియు విస్వాసుల బంగారము, ధనములను కూడా సమకూర్చి ఆలయమును 1962లోకట్టిరి.

కాపరులు: నాతన్ గారు విడిచి పెట్టిన సేవను దైవజనులు కె. సి మాత్యూస్ గారు అపో. పి ఎమ్ సామ్యూల్ గారి తక్షణ ప్రతిస్పందన మేరకు చేపట్టిరి. కేరళ వాస్తవ్యులైనప్పటికి తెలుగు భాష నేర్చుకొని 1982వరకు సుదీర్ఘ సేవలు చేసిరి. వారి సమయములోనే Personage కట్టబడెను. వీరి తరువాత పాస్టర్ సుదర్సనంగారు భాధ్యతలను చేపట్టి 1985వరకు కొనసాగించిరి. పిదప ప్రార్దన పరులైన పాస్టర్ కృపా రక్షణ గారు 19851996 వరకు తన మరణ పర్యంతం సేవను కొనసాగించిరి. తిరిగి 96నుండి97వరకు పాస్టర్ సుదర్శనంగారు మరియు పాస్టర్ మార్టిన్ గారు 97లో 3 నెలలు ఈ సేవను కొనసాగించారు. తరువాత కాలంలో పాస్టర్ ఆర్. జోషప్, పాస్టర్ కృపావరం సేవకులు సంఘమును నడిపించిరి. ప్రస్థుతము వాక్యబోదనలో నిస్ణాతులైన రెవ. రక్షణాండము ఆధ్వర్యములో సంఘం నడుచుట గమనించగలము.

సెక్రటరిషిప్:ప్రధమంలో బ్రదర్ ఎమ్. ఎస్. పాల్ గారు సెక్రటరి కమ్ ట్రెజర్ గా సుమారు దశాబ్డమునకు పైగా పనిచేయగా బ్రదర్ ఎస్. జాన్ గారు కూడా సుమారు12సంఆ సంఘమును ముందుకు నడిపించుటలోప్రముఖ పాత్ర పోషించిరి. బ్రదర్. జోషప్ గారు కూడా ధసాబ్దమునకు పైగా భాద్యతలను నిర్వహించిరి. బ్రదర్ డి.వి రావు గారు కొంత కాలము, బ్రదర్ జాన్ ప్రకాష్ కొంత కాలము బ్రదర్ విజయశేఖర్ గారు కొంత కాలము సంఘమును ముందుకు నడిపించిరి. ప్రస్తుతము బ్రదర్ సి హెచ్. జార్జిగారి ఆద్వర్యంలో సంఘము నడిపించబడుట మనకు కనబడుచున్నది.

ట్రజరర్ షిప్:ధశాబ్దమునకు పైగా బ్రదర్ ఫిలిప్ గారు కోశాదికారిగా తమ విధులు నమ్మకముగా నిర్వహించిరి. ఆ తరువాత బ్రదర్ సైమన్ మనోహార్, బ్రదర్ విజయ శేఖర్, బ్రదర్ జార్జ్, బ్రదర్ డేవిడ్ రాజు, బ్రదర్ చిరంజీవి అనువారు, ఈ బాధ్యతలను, నిర్వర్తించుటబట్టి దేవునికి సోత్రము, కురు వృద్దులు తొలి విశ్వాసులలో ఒకరైన బ్రదర్ డేవిడ్ రాజు ఈ బాద్యతలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.

శాఖోపశాఖలు : ఆరంభములోనే నాతన్ గారి సమయంలో,గోపాలపట్నం, పెందుర్తి, మల్కాపురం, మదురవాడ భోగాపురం, విజయనగరం మొదలగు ప్రాంతాలలో సేవావిస్తరణ జరిగెను.అప్పటి సభ్యులు బ్రదెర్ గాభ్రియేలు, బ్రదెర్ మార్టిన్ లూదర్, బ్రదెర్ డేవిడ్ మొదలగువారు తమ ప్రభుత్వ ఉద్యోగములకు రాజినామా ఇచ్చి సేవకులుగా సమర్పించుకొనుట దేవుని మహిమ. చిన్నగదిలి, మేగాద్రిపేట, ప్రాంతంలో బ్రాంచి సంఘములు ఏర్పాటు చేయుట జరిగెను. ఈ పనిలో బ్రదర్ సాగర్ గారు ముఖ్యులు.

పెద్దలు:పెద్దలుగా తమ బాద్యతలను నెరవేర్చుటలో, బ్రదర్ లూక, బ్రదర్ బి. గాబ్రియేలు, బ్రదర్ యోహాను బ్రదర్ అబ్రహాము బ్రదర్ స్వామూజి, బ్రదర్ వినయ్ భూషణ్, బ్రదర్ సాల్మన రాజ్, బ్రదర్ సుగుణరత్నం, బ్రదర్ ప్రసన్నకుమార్ బ్రదర్ ఫిలొమాన్, బ్రదర్ జేమ్స్ మొదలగు వారి సేవలను మరువలేము. ప్రస్తుతము బ్రదర్ రాబర్ట్స్, బ్రదర్ జీవరత్నం, బ్రతర్ బి కుమార్, బ్రతర్ ప్రదీప్, బ్రదర్ దాస్ అనువారు నేటి పెద్దలుగా సేవచేయుచున్నారు.

కార్యక్రమములు:విశాఖ ప్రాంతమునకు కన్వేన్ షన్ జరిపించుటలో మొదటి ఘనత మన సంఘానికి చెందినది. యూత్ రిట్రీట్, ఉమన్స్ రిట్రీట్, సన్డేస్కూలు, రాలి, గోస్పాల్ కేంప్ మొదలగు బృహుత్తర కార్యక్రమములతో పాటు దైవజనుల నివాస వసతిని పక్కా భవనముగా మార్చుట, దానిపై మరొక అంతస్తు వేయుట,Church బిల్డింగ్Extension, భాల్కానీ వంటి నిర్మాణ కార్యక్రమములు కూడా జరిగెను. సమర్దవంతమైన వ్యవస్త(Committee) కల్గివున్న ఈ సంఘముAccountsను పక్కాగా నిర్వహించుచున్నది. సంఘ విస్వాసులు దూర ప్రాంతం నుండి వచ్చుటకు, వివిధప్రాంతములకు సేవ పరిచర్య నిమిత్తమై ఒక సొంత Mini bus, ఒక సొంత Autoకూడా కలిగివున్నది.

విశ్లేషణ: 48విస్వాసులతో మొదలిడిన ఈ సంఘము నేడు సుమారు 500-600 సభ్యులను (మద్యలో ప్రభువు నందు నిద్రించువారు ఇతర ప్రాంతములకు వెళ్లినవారు కాక) కలిగి వుండుట గమనించగలము. ఆర్దిక పరంగా సుమారు 100 రూ|| కంటె నెల ఆదాయము తక్కువ వచ్చిన ఆరంభ స్థితి నుండి ప్రస్తుతం 45000-50000రూపాయలు మధ్య నెల ఆదాయము వచ్చుట దేవునికే మహిమ. ఇందుకు కారణము సభ్యులు దశమభాగమును క్రమముగా ఇచ్చుట. ప్రతీ ఏటా విధవరాండ్రలకు చీరలుపంపిణీ జైలు పరిచర్య , చిన్న సంఘముల నిర్మాణములకై ఆర్ధిక సహాయము, ఇతర సువార్త గుంపులకు సహాయము జరిగించుట మరువలేనిది. ఏ విదేశి సహాయము, ఇంతవరకులేకుండా కొనసాగుతున్న ఈ సంఘము , సంఘ బీద విద్యార్దులకు ఆర్దిక సహాయము, బీద విస్వాసులకు మరియు సంఘకాపరికి మెడికల్ హెల్ప్, బీద విస్వాసులు మరణించిన సమయంలో సమాధి ఖర్చులు చెల్లించుట మొదలగునవి జరుగుచున్నవి.

భవిష్యత్: సుమారు 30 సం లు ఏరియా సంఘముగా ఉన్న ఈ సంఘము నేడు గ్రేటర్ విశాఖలో ప్రధాన రహదారిలో ప్రదాన సంఘములలో ఒకటిగా ఉంటూ విశాఖ క్రైస్తవ సమాజమునకు వివిధవ్ విషయములలో సహకరించుట గమనించగలము. అట్టి ఈ సంఘము భవిష్యత్తులో కూఢా కర్తవ్యములతోపాటు, మే కన్నుల ముందు గోల్డేన్ జూబ్లి సెలబ్రేషన్ జరిగించుకొనుటకు అందులో ప్రధమ భాగముగా50 సం ల పాత భవన మందిరమును సుమారు 50 లక్షల ఖర్చుతో పునఃనిర్మించుటకు ముందుకు వెలుచున్నదని చెప్పుచూ దేవుని మహిమ పర్చుచున్నాము. మరియు ఈ వధువు సంఘము మరిన్ని ఆత్మీయ వరములతో,ఫలములతో మన ప్రభుని రాకడకు సిద్దపడవలెనని దేవుని ప్రార్దిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్న మీ సహ విశ్వాసి.

సంఘ సెక్రటరీ: సి.హెచ్.జార్జి